ప్రొద్దున్నే మా ఆయన చాలా ప్రేమగా గ్రీన్ టీ తెచ్చి ఇచ్చారు.
ఏమిటో శ్రీవారి కోరిక.ఈ వేళ సూర్య కిరణాలు తాకుతుండగానే గ్రీన్ టీ తెచ్చారు అని అన్నాను.
నాకు తెలుసు.ఆయన నాతో ఏదయినా చేయించుకోవాలి అనుకున్నప్పుడే ఇలా సేవలు చేస్తారు.
మార్కెట్ నుంచి మంచి బెంగుళూరు మామిడి కాయలు తెచ్చాను.
ఇవాళ రోట్లో వేసి పచ్చడి చేయకూడదూ అని మామిడి కాయలు చూపించారు.
సరే అని చెప్పి స్నానం చేయడానికి వెళ్లి వచ్చేసరికి మామిడి కాయలు లేవు.
అయ్యో ఇప్పుడెలా అని బయటకు వెళ్లాను.
పెరట్లోకి వెళ్లి చూద్దును కదా.మా ఆయన నల భీములను మించి కష్టపడి పచ్చడి రుబ్బు దామని వెళ్లి ఎలా రుబ్బాలో అర్థం కాక ఆలోచిస్తున్నారు.
ఏంటండీ!ఏదో ఆలోచిస్తున్నారు అని ఆరా తీశాను.
అదేం లేదు సుమిత్రా.
ఈ రుబ్బుడు గుండు వేళ్ళకి తగలకుండా ఎలా తిప్పడం అని అన్నారు.
నాకు నవ్వాగలేదు. సర్లేండీ.అన్ని విషయాలు ఇంటిలిజెన్స్ ఆఫీసరు గారికే కాదు.కాసిన్ని వాళ్ళ ఆవిడకు అంటే సుమిత్రా దేవి గారికి కూడా తెలుసన్న మాట అని నేను చెప్తాను అని ఆయన్ను కూర్చోబెట్టాను.
రోట్లో పచ్చడి ఎలా చేయాలోనేర్పించినందుకు గాను ఒక ముద్దు ఇవ్వమని అడిగాను.
ఆయన సరేనన్నారు.ఆయన చేతులకు మొత్తం పచ్చడి అంటుకొని ఉంది.నేనాయన ఎడమ వైపు తొడ మీద కూర్చుని ఆయన మెడ చుట్టూ చేతులు వేశాను.
ఆయన పెదాల్ని తనివితీరా ముద్దాడాను.
ఆయన చేతులకు ఉన్న పచ్చడి కాస్త రుచి చూశాను.తియ్యగా అనిపించింది.